ఢిల్లీ: 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని కేంద్రాన్ని కోరామని భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.. ఈ వానాకాలం వడ్ల గురించి తాము మాట్లాడుతున్నామన్నారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర మంత్రుల బృందం, టిఆర్ఎస్ ఎంపిల ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం లిఖితపూర్వకంగా చెప్పాలని నిలదీశారు. గతంలో వస్తే 60 లక్షల టార్గెట్ పూర్తి చేసి రండి అన్నారని, మిగిలిన వానాకాలం వడ్ల సేకరణపై లిఖితపూర్వకంగా కేంద్రం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోయిన యాసంగి గురించి మాట్లాడుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మీడియా దయచేసి దీన్ని గమనించాలని కోరారు. మిగతా ధాన్యం కొంటామని కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలన్నారు. బియ్యం మిల్లింగ్ తర్వాత తరలించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని వేముల సూచించారు.
వడ్ల సేకరణపై కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి: వేముల
- Advertisement -
- Advertisement -
- Advertisement -