Sunday, December 22, 2024

బిజెపి అంటేనే బడా జూటా పార్టీ: వేముల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అభివృద్ధి కెసిఆర్‌తోనే సాధ్యం
బిజెపి అంటేనే బడా జూటా పార్టీ
రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ అభివృద్ధి కెసిఆర్‌తోనే సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలోని భీంగల్, ముచ్కూర్, బాబాపూర్ గ్రామాల నుంచి బిజెపి,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదారంగా ఆహ్వానించారు.

Also Read: పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యం

ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని భ్రమలు కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాచికలు తెలంగాణలో పారవన్నారు. బిజెపి అంటేనే బడా జూటా పార్టీ అని మంత్రి విమర్శించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా మొదలుకొని రాష్ట్రంలోని బిజెపి మండల అధ్యక్షుడి వరకు నోరు తెరిస్తే అబద్ధాలు, అసత్యాలే మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. బాల్కొండ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో అన్ని విధాలా అభివృద్ది చేసుకున్నామని మంత్రి వేముల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. మధు శేఖర్, రాజారాం యాదవ్, భీంగల్ మండల ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News