Friday, November 22, 2024

ఆ నీటిని తరలించుకుపోతే రైతుల నోట్లో మట్టే: వేముల

- Advertisement -
- Advertisement -

21k people get skill training in nac next year

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కృష్ణా నీటిని అక్రమంగా తరలించుకపోతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని ఎపిని కృష్ణా బోర్డు ఆదేశించిందన్నారు. ఎపి నీటిని తరలించుకుపోతే తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టినట్టే అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టే అని, ఆ ప్రాజెక్ట్‌ను చేపట్టవద్దని గ్రీన్ ట్రిబ్యునల్ ఇంతకుముందే చెప్పిందన్నారు. కృష్ణా బోర్డు ఆదేశాలపై ఆంధ్రా నేతలు ఏం సమాధానం చెప్తారని వేముల ప్రశ్నించారు. ఎపి చెప్తున్న లెక్కలన్నీ అబద్దాలేనని అన్నారు. కృష్ణా బోర్డు ఎపి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎపి ప్రభుత్వం జివొ జారీ చేసిన వారంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించిందన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అని, కాంగ్రెస్ నాయకుల మాటలు దయ్యాలు వేదాలు వల్లించనట్టుగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు 300 పైగా కేసులు వేశారని వేముల మండిపడ్డారు. ఎపి అక్రమ ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రశ్నించడంలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ బద్ద వ్యతిరేకి కాదా? అని అడిగారు. కేంద్రం ఆదేశాలను ఎపి పట్టించుకోకుంటే బిజెపి నేతలు ఎందుకు మాట్లాడుతలేరని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యం నాలుగు రెట్లు పెంచింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. వైెఎస్ఆర్ రాయలసీమకు నీళ్లు తీసుకొనిపోతుంటే డికె అరుణ హారతి పట్టలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News