Sunday, December 22, 2024

కాంగ్రెస్, బిజెపిలు సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి..

- Advertisement -
Vemula Prashanth Reddy Slams BJP Leaders
హైదరాబాద్: పంజాబ్ లో వరి ధాన్యం, గోధుమలను సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ నుండి వానాకాలం, యాసంగి ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్ లో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ”తెలంగాణలో యాసంగిలో పండిన ధాన్యం నూకలవుతాయి.. దుకాణంలో గిరాకి ఉన్న పంటనే తీసుకుంటాం అని కేంద్ర మంత్రి అన్నారు. మీ ధాన్యం మీరే కొనండి .. మీ నూకల బియ్యాన్ని మీ ప్రజలకు మీరు అలవాటు చేయండి .. మేము పీడీఎస్ బియ్యం ఆపేస్తాం.. మీరు నూకలను పీడీఎస్ కింద ఇవ్వండి అన్నారు.
తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలి. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా దిక్కులేకుండా పోయాడు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవమానకరంగా మాట్లాడిన మీకు కూడా అదే గతి పడుతుంది. తెలంగాణ బీజేపీ నాయకుల నాల్కకు.. మెదడుకు లింకు తెగిపోయింది. వారేం మాట్లాడుతున్నారో వారికే అర్ధం కావడం లేదు. యాసంగిలో వరి వేస్తే కేంద్రంతో నేను కొనిపిస్తాను.. కేసీఆర్ ను పట్టించుకోకండి అని బండి సంజయ్ అన్నాడు.. ఇప్పుడు రాష్ట్రం సహకరించడం లేదు అంటున్నాడు. ఇతడు మనిషేనా?.. ఈయన బీజేపీ అధ్యక్షుడా?.
బండి సంజయ్ కి ఒంట్లో నెత్తురుంటే, మగాడివైతే కేంద్రం ధాన్యం కొనిపించాలి. రాష్ట్రం పూర్తిగా దానికి సహకరిస్తాం. నీవు మూడు సందర్భాల్లో మాట్లాడిన మాటలకు మేము కట్టుబడి ఉంటాం..సహకరిస్తాం. కేంద్రంతో ధాన్యం కొనిపించు. ఐదు, ఆరు నెలల తర్వాత మీరు డబ్బులు చెల్లిస్తారు.. దానికి వడ్డీ భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం తయారుచేసిన షరతుల పేపరు మీద బలవంతంగా సంతకం పెట్టించుకుంది. అది పద్దతికాదని కేంద్రాన్ని కోరవలసిన కిషన్ రెడ్డి ఆ కాగితం చూయించడం బాధాకరం. కేంద్రం రాజకీయ కక్ష్యతో వ్యవహరిస్తుందని కిషన్ రెడ్డికి తెలుసు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి ధాన్యం కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలి. ఫంటలను కేంద్రం కొనుగోలు చేస్తుందన్న విషయం రేవంత్ రెడ్డికి తెలియదా?. కేంద్రాన్ని ప్రశ్నించకుండా రేవంత్ రాష్ట్రం కొనాలని డిమాండ్ చేయడంలో అర్దం ఏంటి?. కాంగ్రెస్, బీజేపీలు మిలాఖత్ అయి సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి. రేవంత్, బండి సంజయ్ లు రాజకీయ నాయకులా?, వీళ్లవి జాతీయ పార్టీలా? ఈ రాష్ట్ర రైతుల పక్షాన కలసికట్టుగా ఉండాలన్న ఇంగితం లేదా?. ప్రజలు గమనిస్తున్నారన్న ఇంగితం లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి మీద కొంత గౌరవం ఉండేది. బండి సంజయ్ ని చూసి కిషన్ రెడ్డి అలాగే మాట్లాడుతున్నాడు” అని మండిపడ్డారు.
Vemula Prashanth Reddy Slams BJP Leaders
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News