Monday, January 20, 2025

వ్యవసాయం పండుగలా మారింది: వేముల

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంత్రి కెటిఆర్ కామారెడ్డి పర్యటిస్తున్న సందర్భంగా వేముల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ కార్పొరేషన్‌ను రూ.810 కోట్లతో అభివృద్ధి చేశామని, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మరిన్ని రోడ్లు, బ్రిడ్జీలు మంజూరు చేస్తామని మంత్రి వేముల వివరించారు. మంత్రి కెటిఆర్ తెలంగాణ మూడు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకరావడంతో 16 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించారని మంత్రి వేముల కొనియాడారు. తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందని, దేశంలో తెలంగాణను అగ్రగామిగా సిఎం కెసిఆర్ నిలబెడుతున్నారని ప్రశంసించారు.

Also Read: కామారెడ్డికి స్వాగత తోరణం: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News