Monday, December 23, 2024

ఎసిబి వలలో చిక్కిన మున్సిపల్ కమిషనర్

- Advertisement -
- Advertisement -

Vemulawada Municipal commissioner caught in ACB trap

సిరిసిల్ల : వేములవాడ పట్టణ మున్సిపల్ కమిషనర్ మంగళవారం ఎసిబి వలకు చిక్కాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో లంచగొండి అధికారి చిక్కాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ భద్రయ్య నేతృత్వంలో దాడులు నిర్వహించి 30 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్రావును పట్టుకున్నారు. ఓ కాంట్రాక్ట్ పొడిగించే విషయంలో కాంట్రాక్టర్ ను డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. కమీషనర్ కాంట్రాక్టర్ నుండి రూ. 30 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News