Sunday, December 22, 2024

వేములవాడను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తాం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి వేడుకలపై రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రమేష్ బాబు, వేములవాడ ఆలయ అధికారులు, ఆర్అండ్ బి అధికారులు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ…. వేములవాడలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. వేములవాడను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రామప్ప గుట్టపై ఎత్తైన శివుని విగ్రహం, కాటేజీల నిర్మిస్తామని కెటిఆర్ తెలిపారు. నాంపల్లిగుట్టపై కేబుల్ కారు సౌకర్యం ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News