Wednesday, January 22, 2025

తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్

- Advertisement -
- Advertisement -

రఘునాథపాలెం : తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరం దంసలాపురం సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి మంత్రి పువ్వాడ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు ఆయన కల అని, ఆ కలను సిఎం కెసిఆర్ నిజం చేసి చూపించారని ప్రశంసించారు. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, ప్రొఫెసర్‌గా కెసిఆర్‌కి ఆప్తుడుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, రాష్ట్రం ఎందుకు అవసరమో అవగాహన కల్పిస్తూ ఉద్యమాన్ని ఏకతాటిపైకి నడిపించిన ఉద్యమకారుడు జయశంకర్ సార్ అని అభివర్ణించారు.

నాలుగు దశాబ్దాలు ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలో గొప్ప పాత్ర పోషించారన్నారు. వారి చిరకాల స్వప్నాన్ని నేడు కెసిఆర్ ఆచరణలో చూపారని వారి ఆశయాలను సాధించారని అన్నారు. కార్యక్రమంలో మాయోర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ విపి.గౌతమ్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మందడపు లక్ష్మిమనోహర్, మక్బూల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, నాయకులు పగడాల నాగరాజ్, షకీన తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News