Sunday, December 22, 2024

పాక హోటల్‌లో ఇడ్లీని ఆస్వాదించిన వెంకయ్య నాయుడు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విజయవాడలోని ఎస్‌ఎస్‌ఎస్ పాక హోటల్‌లో మంగళవారం ఉదయం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చక్కటి ఇడ్లీని ఆస్వాదించారు. నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్నారు.

గుబురు చెట్ల నీడన, సాంప్రదాయం ఉట్టిపడే ఈ పాక హోటల్‌లో ఒక్కసారైనా ఇడ్లీ రుచి చూడాలి. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్న నిర్వాహకులకు, సిబ్బందికి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. బలవర్థకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలని ఆయనన్నారు.

Also Read: 2వేల పడకలతో నిమ్స్ నూతన భవనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News