Wednesday, January 22, 2025

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్‌టిఆర్: వెంకయ్యనాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్‌టిఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ వర్ధంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్‌టిఆర్ స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి అభిమానులను అలరించారు. పౌరాణిక చిత్రాలలో ఎన్‌టిఆర్ నటించడంతో తెలుగు వారు తమ ఇండ్లలో ఆయనను శ్రీ కృష్ణుడు, శ్రీరాముడిగా పూజిస్తారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లో  ఎన్‌టిఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించి కాంగ్రెస్ గద్దె దింపడం ద్వారా దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వెంకయ్య నాయుడు కొనియాడారు. సమాజంలో బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి మంచి పరిపాలనతో గొప్ప పరిపాలనదక్షుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. సుదూర రాజకీయ పరిపాలన, సంస్కరణలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని ఇస్తాయని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News