Monday, December 23, 2024

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రెండోసారి కరోనా..

- Advertisement -
- Advertisement -

Venkaiah Naidu test positivie for Corona

మన తెలంగాణ/హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా సోకింది. 2020 సెప్టెంబర్‌లో తొలిసారిగా ఉపరాష్ట్రపతికి కరోనా సోకిన విషయం విదితమే. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వెంకయ్యకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన హోం హోసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ల సూచన మేరకు వారం పాటు ఉపరాష్ట్రపతి స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Venkaiah Naidu test positivie for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News