మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని ధర్మాపూర్ వద్ద జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్స స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ 120 వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… జయప్రకాష్ ను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్లాలని సూచించారు. అన్యాయాలకు, అక్రమాలకు అరాచకానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పటిష్టతకు అలుపెరగకుండా పోరాటం చేసిన గొప్ప నాయకుడు జయప్రకాష్ నారాయణ ఆయన పేర్కొన్నారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా మాతృభాషను నేర్చుకోవాలి, ఆ తర్వాత ఇతర భాషల పట్ల మక్కువ పెంచుకోవాలని వెంకయ్య సూచించారు. ఆంగ్ల భాషలో చదువుతేనే ఉన్నత స్థానాలకు ఎదుగుతామని యువతలో ఈ భావన నాటుక పోయిందన్నారు. దాన్ని విడనాడాలన్నారు. మాతృభాషలో చదివిన వారు ఎంతో గొప్ప వ్యక్తులుగా ఎదిగిన విషయాన్ని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గుర్తుచేశారు.
జైపాల్ రెడ్డిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి: వెంకయ్య నాయుడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -