Friday, November 22, 2024

మహాత్ముని జన్మస్థలంలో వెంకయ్య నాయుడు పర్యటన..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు శనివారం తన ఒకరోజు పర్యాటనలో భాగంగా గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో మహాత్మా గాంధీ జన్మస్థలాన్ని సందర్శించడంతోపాటు ద్వారకాలోని రెండు ఆలయాలలో పూజలు చేశారు. తదుపరి ఉప రాష్ట్రపతికి సంబంధించిన పోలింగ్ జరుగుతున్న రోజే ఆయన గుజరాత్‌ను సందర్శించడం విశేషం. ఉప రాష్ట్రపతిగా పదవి నుంచి తప్పుకుంటున్న వెంకయ్య నాయుడు, తన సతీమణి ఉషతో కలసి జామ్‌నగర్ వైమానిక కేంద్రానికి చేరుకోగా అక్కడ ఆయయనకు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి వెంకయ్య నాయుడు దంపతులు ద్వారకను చేరుకుని నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని, ద్వారకాధీశ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం పోర్‌బందర్‌లో మహాత్మా గాంధీ జన్మస్థలాన్ని, మహాత్ముని పూర్వీకుల ఇంటిని ఆనుకుని ఉన్న స్మారక మందిరం కీర్తి మందిర్‌ను వారు సందర్శించారు. పోర్‌బందర్‌లో వెంకయ్య నాయుడుకు స్థానిక బిజెపి నాయకులు సాంప్రదాయక తలపాగాను అందచేసి సాదర స్వాగతం పలికారు.

Venkaiah Naidu Visit birth place of Mahatma Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News