Sunday, December 22, 2024

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు..

- Advertisement -
- Advertisement -

Venkaiah Naidu visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా దర్వించుకున్నారు. గురువారం ఉదయం తన భార్య ఉష నాయుడు, ఇతర కుటుంబ సభ్యులతో శ్రీవాని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, వెంకయ్యనాయుడుకు సాదరస్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, పుష్పగిరి మఠంలో వెంకయ్యనాయుడు మనవరాలు సుష్మ ఈరోజు(ఫిబ్రవరి10) పెళ్లిపీటలెక్కనుంది.

Venkaiah Naidu visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News