Thursday, December 26, 2024

దేశీయ వాహకనౌక విక్రాంత్‌ను పరిశీలించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

- Advertisement -
- Advertisement -

Venkaiah Naidu visits domestic carrier Vikrant

కోచి: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(సిఎస్‌ఎల్)లో దేశీయంగా నిర్మించిన విమాన వాహకనౌక(ఐఎసి) విక్రాంత్‌ను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సందర్శించారు. ఆదివారం లక్షద్వీప్ నుంచి కోచికి చేరుకున్న ఆయన సిఎస్‌ఎల్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. యార్డ్‌లో నావీ కోసం తయారు చేస్తున్న పరికరాల గురించి సిఎస్‌ఎల్ చైర్మన్ మధు ఎస్ నాయర్ ఉపరాష్ట్రపతికి వివరించారు. నాయుడు వెంట కేరళ గవర్నర్ అరీఫ్ మహ్మద్‌ఖాన్, రాష్ట్ర మంత్రి పి.రాజీవ్, సౌతర్న్ నావల్ కమాండ్ చీఫ్ రియర్ అడ్మిరల్ ఆంటోనీజార్జి ఉన్నారు. కుటుంబసభ్యులతో డిసెంబర్ 31న కేరళ వెళ్లిన వెంకయ్యనాయుడు ఈ నెల 4న తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News