నల్లగొండ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తెలుగు అంటే చాలా మక్కువ. తెలుగు కవులను ప్రొత్సహిస్తూనే ఉంటారు. అవకాశం ఉన్న ప్రతి చోటా మాతృ భాషపై ప్రేమను చూపిస్తూనే ఉంటారు. ఎక్కడికెళ్లిన మాతృ భాష, పుట్టిన గడ్డను మరిచిపోవద్దని చెబుతూ ఉంటారు. గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని సంస్కృతిని, ప్రత్యేకించి నల్గొండ జిల్లా ప్రజల జీవన విధానంలో రచించిన కథల పుస్తాక యువ రచయిత వి.మల్లికార్జున్ ను ఉప రాష్ట్రపతి అభినందించారు. ఉపరాష్ట్రపతికి తాను రచించిన పుస్తకాన్ని అందజేశారు. ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ప్రజల జీవన విధానం నేపథ్యంలో ‘నల్లగొండ కథలు’ పుస్తకాన్ని వారి నుంచి అందుకోవడం జరిగింది. తన ట్విట్టర్ లో వెంకయ్య నాయుడు వారికి అభినందనలు తెలిపారు.
గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని సంస్కృతిని, ప్రత్యేకించి నల్గొండ జిల్లా ప్రజల జీవన విధానం నేపథ్యంలో శ్రీ వి.మల్లికార్జున్ రచించిన నల్గొండ కథలు పుస్తకాన్ని వారి నుంచి అందుకోవడం జరిగింది. వారికి అభినందనలు. pic.twitter.com/uxo6qSLatG
— Vice President of India (@VPSecretariat) July 13, 2021