Wednesday, January 22, 2025

ప్రేమ పేరుతో కూతురుకు వేధింపులు…. రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

గద్వాల: ప్రేమ పేరుతో కూతురును వేధించడంతో తండ్రి మనోవేదనకు గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జోగుళాంబ గద్వాల్ జిల్లాలో వెంకంపేట శివారులో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. గద్వాల్‌కు చెందిన ఓ వ్యక్తి(34) కూలీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సదరు వ్యక్తి కూతురు(16) ఓ పాఠశాలలో చదువుతోంది. గత కొన్ని రోజులుగా బాలికను వినోద్ అనే యువకుడు వేధిస్తుండడంతో పలుమార్లు హెచ్చరించారు. కూతురును చదువు మాన్పించిన కూడా యువకుడిలో మార్పు రాకపోవడంతో ఆమె తండ్రి మనోవేదనకు గురయ్యాడు. వెంకంపేట శివారులో రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News