Monday, December 23, 2024

వెంకన్నా… దీవించు

- Advertisement -
- Advertisement -

కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సిఎం కెసిఆర్
స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాలకు పూజ.. అక్కడే సంతకాలు

మనతెలంగాణ/హైదరాబాద్/సిద్దిపేటప్రతినిధి/నంగనూరు : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ము ఖ్యమంత్రి కెసిఆర్ సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఆలయానికి చేరుకున్న సిఎం కెసిఆర్‌కు మంత్రి హరీశ్ రావు స్వాగతం పలుకగా, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వా గతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసి.. వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ముందు గా ఆ లయం చుట్టూ ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ఆలయంలోకి సిఎం ప్రవేశించారు. నామినేషన్(విజయ) పత్రాలను హ రీశ్ నామినేషన్ పత్రాలను ఆలయ అర్చకులకు అందించగా మూలవిరాట్టు వద్ద పత్రాలు ఉంచి సిఎం కెసిఆర్ గోత్ర నామాలు,సంకల్పం తో పూజలు నిర్వహించారు. అర్చకులు సిఎం కెసిఆర్ చేతికి కంకణధారణ చేసి తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచణం అందించారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సిఎం కెసిఆర్ , మంత్రి హరీశ్‌రావు సంతకాలు చేశారు.

పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన సిఎం కెసిఆర్‌కు మహిళలు విజయ తిలకంది ద్దారు. కెసిఆర్ జిందాబాద్, బిఆర్‌ఎస్ జిందాబాద్ అంటూ హర్షధ్వానాలు చేశారు. హ్యాట్రిక్ సిఎం…కెసిఆర్.. అంటూ నినాదాలు చేశారు. కెసిఆర్ విజయం తథ్యం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై అత్యంత అభిమానంతో గులాబీల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్‌రెడ్డి, బిఆర్‌ఎస్ నేత శ్రవణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రధాన ముఖద్వారం దక్షిణం వైపు ఉండడం ఇక్కడి కోనాయిపల్లి దేవాలయం ప్రత్యేకత. ఎన్నికల్లో నామినేషన్ వేసే ప్రతిసారి సిఎం కెసిఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ నెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. అదేరోజు బిఆర్‌ఎస్ ఆశీర్వాదసభల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి , ప్రజా ప్రతినిధులు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బాలకిషన్‌రావు, కడవేరుగు రాజనర్సు, రాధాకృష్ణశర్మ, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, లింగంగౌడ్, సారయ్య, మోహన్‌లాల్, పాల సాయిరాం, అరవింద్‌రెడ్డి, బూర విజయ, నందా దేవి, సువర్ణ లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం సిఎం కెసిఆర్‌కు, పార్టీకి సెంటిమెంట్‌గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చి నా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సిఎం కెసిఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు.

కెసిఆర్, హరీశ్‌రావు, ఇతర పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శించుకుని స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సిఎం కెసిఆర్‌కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎంఎల్‌ఎగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు. మరో విశేషం ఏమిటంటే, 2001లో టిడిపికి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎంఎల్‌ఎ పదవులకు రాజీనామా చేసిన కెసిఆర్.. ఆ తర్వాత ఈ ఆలయంలోనే పూజలు చేసి టిఆర్‌ఎస్ పార్టీని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News