Monday, December 23, 2024

హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: మంగళవారం ఉదయం శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు శ్రీరాములు వారి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్త జన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వర్ణ రథోత్స‌వ‌ము వైభ‌వంగా జ‌రుగ‌నుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో  గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్టు మెంట్లలో వేచివున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన కోసం భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. సోమవారం 70,570 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 22, 490 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.76 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News