- Advertisement -
కామారెడ్డి: ఉగాది పండగ రోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, ఇద్దరు కుమారులు, కుమార్తె మృతి చెందారు. బట్టలు ఉతకడానికి వెళ్లి చెరువులో పడి మృత్యువాతపడ్డారు. పిల్లలు నీళ్లలో పడిపోవడంతో వారిని కాపాడటానికి తల్లి ప్రయత్నించి చెరువులో మునిగిపోయింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు చెరువు వద్దకు చేరుకొని మూడు మృతదేహాలను బయటకు తీశారు. తల్లి మౌనిక డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాపురం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఒకే ఇంట్లో నలుగురు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
- Advertisement -