Thursday, December 19, 2024

మనోజ్ఞగా ఆశ్చర్యపరచనుంది

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ ’సైంధవ్’ ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. చిన్న విరామం తర్వాత ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. శనివారం ఆమె పాత్రను మనోజ్ఞగా పరిచయం చేశారు. పోస్టర్‌లో ఏదో లోతుగా ఆలోచిస్తున్నట్లు చాలా సీరియస్ గా కనిపిస్తోంది. మనోజ్ఞ క్యారెక్టర్ ఇప్పటి వరకు శ్రద్ధకు వచ్చిన పాత్రల్లో బెస్ట్. ఇది పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. జెర్సీ చిత్రంలో తన నటనకు ప్రశంసలు పొందిన శ్రద్ధా ‘సైంధవ్’లో మనోజ్ఞ గా ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుంది. ‘సైంధవ్’ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News