Sunday, January 19, 2025

జోరుగా హీరో వెంకటేశ్ కుమార్తె ప్రచారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం : స్టార్ హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత కూడా ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగారు. ఖమ్మం లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి తరఫున ఆమె ప్రచారం చేస్తున్నారు. ఖమ్మంలో బిఆర్‌ఎస్ తరపున నామా నాగేశ్వరరావు, బిజెపి నుంచి తాండ్ర వినోద్‌రావు, కాంగ్రెస్ తరఫున రఘురామరెడ్డి పోటీ చేస్తున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విక్టరీ వెంకటేశ్‌ల వి య్యంకుడు రఘురామరెడ్డి. ఆయన కోసం వెంకటేశ్ ప్రచారం చేస్తారా? అనే చర్చ నడుస్తోంది. అయితే వెంకటేశ్‌కు బదులుగా ఆయన కూతురు అశ్రిత ప్రచారంలోకి దిగారు. పార్టీ కండువా కప్పుకుని ఆమె ప్రచారం చేస్తున్నారు. తన మామ రఘురామరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్య ర్థిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News