Friday, November 22, 2024

‘ఎఫ్ 3’లో ట్రిపుల్ డోస్ వినోదం..

- Advertisement -
- Advertisement -

“ఎఫ్ 2 సినిమా పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాని, అందులోని పాత్రలని ప్రేక్షకులంతా ఎంతో అభిమానించారు. ఇక ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఎఫ్ 2’కి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్ 3’లో వుంటుంది”అని అన్నారు హీరో విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో విక్టరీ వెంకటేష్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
అప్పుడే కడుపుబ్బ నవ్వించగలుగుతాము…
నా ప్రతి సినిమాని మొదటి సినిమాగానే భావిస్తా. ప్రతి సినిమాకి అలానే కష్టపడతా. ముఖ్యంగా కామెడీ ఎంటర్‌టైనర్లు చేసినప్పుడు స్టార్ ఇమేజ్‌ని పక్కన పెట్టి నటించినప్పుడే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలుగుతాము. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, అబ్బాయి గారు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి.. ఇలా ఎన్నో చిత్రాలు ఎలాంటి ఇమేజ్ లెక్కలు వేయకుండా చేసినవే. సినిమా చేసినప్పుడు ఎక్కువ ఆలోచించను. సినిమాని, నా పాత్రని ఎంజాయ్ చేస్తాను. ఇక ‘ఎఫ్ 3’ అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది.
ఓ కిక్ వుంటుంది…
నారప్ప, దృశ్యం రెండూ సీరియస్ సినిమాలు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయ్యాయి. ‘ఎఫ్ 3’తో మళ్ళీ థియేటర్ ఆడియన్స్‌ని కలవడం ఆనందంగా వుంది. రెండేళ్ళ గ్యాప్ తర్వాత ‘ఎఫ్ 3’లాంటి బిగ్ ఎంటర్‌టైనర్‌తో రావడం హ్యాపీగా వుంది. ఫ్యామిలీతో కలిసి ఇలాంటి ఎంటర్‌టైనర్లు చూడటంలో ఓ కిక్ వుంటుంది.
ఆద్యంతం వినోదాత్మకంగా…
‘ఎఫ్ 3’ డబ్బు చుట్టూ తిరిగే కథ. త్వరగా డబ్బులు సంపాదించడం, పెద్ద కలలు కనడం, అవకాశాలు సృష్టించడం మానవుని సహజ లక్షణం. అందరికీ ఆశ వుంటుంది. ఈ క్రమంలో బోలెడు సమస్యలు ఎదురవుతాయి. బోలెడు పాఠాలు నేర్చుకుంటాం. ఆ పాఠాలతో మారుతాం. ఒకవేళ మారకపోతే .. మళ్ళీ అవే సమస్యల చుట్టూ తిరగాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ‘ఎఫ్ ౩’ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది.
అద్భుతమైన కామెడీ టైమింగ్…
దర్శకుడు అనిల్ రావిపూడి నటీనటుల నుండి ది బెస్ట్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. చాలా అద్భుతంగా రాస్తారు. ఆయన డైలాగ్స్ చాలా నేచురల్‌గా వుంటాయి. దీంతో నటన కూడా సహజంగా అనిపిస్తుంది. అనిల్‌లో అద్భుతమైన కామెడీ టైమింగ్ వుంది. ఆయనకి ఏం కావాలో క్లారిటీ వుంది. ‘ఎఫ్ 3’లో వరుణ్ తేజ్ పాత్ర ఇంకా బావుంటుంది. అతను చాలా అద్భుతంగా నటించాడు.
చాలా హార్డ్ వర్క్ చేస్తారు…
నిర్మాత దిల్ రాజుతో ఇది నా మూడో సినిమా. ఆయన సినిమాని చాలా బాగా పరిశీలిస్తారు. సినిమాల పట్ల చాలా ప్యాషన్ వుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎంతో కృషి చేస్తే గానీ ఇన్ని విజయాలు రావు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటాను. ఈ సినిమాకు దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి డ్యాన్స్ నెంబర్స్ వున్నాయి.
నెక్ట్స్ మూవీస్…
ప్రస్తుతం సితార, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌లో సినిమాలు చేస్తున్నాను.

Venkatesh interview about F3 Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News