కోయంబత్తూర్: దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ గాయం బారిన పడ్డాడు. వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా చింతన్ గజా వేసిన బంతిని అయ్యర్ ఆడాడు. ఆ బంతి బౌలర్ గజా దగ్గరికి వెళ్లింది. ఆ బంతిని అందుకున్న గజా దాన్ని నేరుగా అయ్యర్‌పైకి విసిరాడు. అది నేరుగా అయ్యర్ మెడకు తాకడంతో బాధతో మైదానంలోనే విలవిలాడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి వెంకటేశ్‌ను పరీక్షించాడు. అయితే కొద్ది సేపటికే తేరుకున్న వెంకటేశ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి పోయాడు. ప్రస్తుతం అతను వైద్యల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ క్రమంలో వెస్ట్‌జోన్ బౌలర్ గజా వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు బంతిని వెంకటేశ్ సిక్స్‌గా మలచడంతో ప్రస్ట్రేషన్‌లో ఉన్న గజా తన వద్దకు వచ్చిన బంతిని వెంకటేశ్ మీదకు విసిరాడు. కాగా, అతనిపై బిసిసిఐ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
Venkatesh Iyer gets injury