Saturday, April 5, 2025

తనపై వచ్చిన ట్రోల్‌కి ధీటుగా జవాబిచ్చిన వెంకటేశ్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో 18వ సీజన్‌లో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ విజయంలో కోల్‌కతా ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌కి ముందు వెంకటేశ్ విమర్శలు ఎదురుకున్నాడు. అతను ఆడిన మ్యాచుల్లో కేవలం 9 పరుగలు మాత్రమే చేశాడు.

అయితే ఐపిఎల్ మెగా వేలంలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లలో వెంకటేశ్ మూడు స్థానంలో ఉన్నాడు. అతన్ని కోల్‌కతా రూ.23.75 కోట్లకు అట్టిపెట్టుకుంది. దీంతో ఇంత డబ్బు తీసుకొని చెత్త ప్రదర్శన చేస్తున్నాడు అంటూ వెంకటేశ్‌పై ట్రోల్ పుట్టుకొచ్చాయి. దీంతో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తనపై వచ్చిన ట్రోల్స్‌కి ధీటుగా జవాబిచ్చాడు. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ.. తాను అత్యధిక మొత్తం అందుకున్నంత మాత్రానా.. ప్రతీ మ్యాచ్‌లోనూ పరుగులు చేయాలని కాదని పేర్కొన్నాడు. ఐపిఎల్‌లో ఆటగాడు తీసుకుంది. రూ.20 లక్షల, రూ.20 కోట్లా అనేది ముఖ్యం కాదని.. డబ్బు ఆటని నిర్ధేశించదని అన్నాడు. ఐపిఎల్ అంటేనే ఒత్తిడి ఉంటుందని.. జట్టు విజయం కోసం ఏం చేశామనేదే ముఖ్యమని.. ఆ విషయంలో మాత్రం వెనకడుగు వేయను అని స్పష్టం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News