Wednesday, January 22, 2025

సంక్రాంతికి ‘సైంధవ్’

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం సైంధవ్. వెరీ ట్యాలెంటెడ్ హిట్ వర్స్ ఫేమ్ శైలేష్ కొలను దర్సకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాణం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకులముందుకు రానుంది. యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని విడుదల చేయడానికి పండుగ సీజన్ బెస్ట్ ఛాయిస్.

మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్లుగా, జనవరి 13 న పండుగకు ఒక రోజు ముందు సైంధవ్ రాబోతున్నాడు. పోస్టర్‌లోవెంకటేష్, బేబీ సారాతో కనిపించారు. వెంకటేష్‌కు సంక్రాంతి మోస్ట్ సక్సెస్ ఫుల్ సీజన్. లాంగ్ హాలీడేస్ సినిమాకి అడ్వాంటేజ్ కానున్నాయి. అంతేకాకుండా, ఈ పాన్ ఇండియా చిత్రాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి మేకర్స్ కు తగినంత సమయం లభిస్తుంది.

సినిమాలోని ఎనిమిది పాత్రలు- వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిక్, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరేమియా, సారా,  జయప్రకాష్ డిఫరెంట్ పోస్టర్ల ద్వారా పరిచయమయ్యారు. పాపులర్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, ఎస్ మణికందన్ డీవోపీగా పని చేస్తున్నారు. గ్యారీ బిహెచ్ ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. సైంధవ్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సినిమా అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News