Monday, December 23, 2024

ఘనంగా వెంకటేష్ రెండో కుమార్తె నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హయ వాహిని నిశ్చితార్థం ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్ ఫ్యామిలీతో వెంకటేష్ వియ్యం అందుకున్నట్లు సమాచారం. వెంకటేష్ స్వగృహంలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నాగచైతన్య, దగ్గుబాటి రానాతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

ఇక వెంకటేష్, నీరజ దంపతులకు నలుగురు సంతానం. అశ్రిత, హయ వాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం 2019లో జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News