Sunday, January 19, 2025

పిలుపు మారినా ప్రేమ మాత్రం తగ్గలేదు: వెంకటేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన జీవితంలో కుటుంబం ప్రోత్సహం ఎంతో గొప్పదని విక్టరీ వెంకటేష్ తెలిపారు. తాను ఇన్ని సినిమాలు చేస్తానని అనుకోలేదని, అన్నయ్య సురేష్ బాబు ఇచ్చిన ప్రోత్సహంతోనే హీరో అయ్యానని పేర్కొన్నారు. 75 సినిమాలు తీసిన సందర్భంగా “వెంకీ 75 కలియుగ పాండవులు-సైంధవ్” అనే పేరుతో హైదరాబాద్‌లో బుధవారం వేడుక జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ ప్రసంగించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కలియుగ పాండవులు సినిమాతో తన సినీరంగ ప్రవేశం మొదలైందని, దాసరి నారాయణరావు, కె,. విశ్వనాథ్ తదతర అగ్ర దర్శకులతో కలిసి పని చేయడం గొప్పగా ఉందని చెప్పారు. మొదట్లో తనని విక్టరీ అనే వారు అని, తరువాత రాజా, పెళ్లికాని ప్రసాద్, పెద్దోడు, వెంకీ అని ముద్దుగా అభిమానులు పిలుచుకునేవారని, పిలుపు మారినా అభిమానుల ప్రేమ మాత్రం తగ్గలేదన్నారు. సినిమా రంగం వదిలి వెళ్లిపోదామనుకున్న సమయంలో చిరంజీవి బ్లాక్‌బస్టర్ ఇచ్చేవారని వెంకటేష్ కొనియాడారు. హీరోలు బాలకృష్ణ, నాగార్జున తనకు పాజిటీవ్ ఎనర్జీ ఇచ్చేవారని మెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమాలో నటిస్తానని వెంకీ చెప్పుకొచ్చారు. ఏదైనా రావాల్సిన సమయంలోనే వస్తుందని, హైరానా పడొద్దని సూచించారు. కృషి, పట్టుదల నిలకడతోనే విజయాలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News