Monday, December 23, 2024

వైభవంగా వెంకటేష్ కూతురు వివాహం

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి కుమార్తె హవ్య వాహిని, డాక్టర్ నిషాంత్ శుక్రవారం నాడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో కుటుంబసభ్యులు, వధూవరుల స్నేహితులు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక అంతకుముందు ఆనందోత్సాహాలతో కూడిన సంగీత్, పెళ్లి కూతురు ఫంక్షన్స్‌తో వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హవ్య వాహిని… వెంకటేష్, దగ్గుబాటి నీరజల కుమార్తె కాగా నిషాంత్… డాక్టర్ పాతూరి వెంకట రామారావు, అరుణల కుమారుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News