Thursday, January 9, 2025

మునుగోడు నూతన ఎస్‌ఐగా వెంకటేశ్వర్లు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మునుగోడు మండల నూతన ఎస్‌ఐగా చందా వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ బ్రాంచ్ నుంచి బదిలీపై మునుగోడుకు రాగా, ఇక్కడ ఎస్‌ఐగా పనిచేస్తున్న దేవిరెడ్డి సతీష్‌రెడ్డి చింతపల్లి మండల ఎస్‌ఐగా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండల శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు,జర్నలిస్టులు పోలీస్ శాఖవారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News