Wednesday, January 22, 2025

అప్పుడే వెంకటేశ్వరస్వామి నాకు ప్రాణభిక్ష పెట్టారు: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఎపి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నో ఎన్నికలు చూశామని, కానీ సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ప్రశంసించారు.  ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2003లో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం మొదలైందని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతోనే అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డానని, రాష్ట్రానికి, జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. తిరుమలలో అన్నదానం తీసుకొచ్చింది దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆరేనని, దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి ఒక రోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉండాలని, భారతీయుల్లో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని, సంపద సృష్టించాలి, పేదవాళ్లకు చేరాలన్నదే తన లక్ష్యమన్నారు. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మార్చాలని, ఆర్థిక అసమానతలను తొలగించడమే తమ ధ్యేయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News