Friday, April 4, 2025

డిఇఒగా భాద్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా వెంకటేశ్వర్లు శుక్రవారం భాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నూతన డిఇఒగా వెంకటేశ్వర్లు అధికారికంగా భాధ్యతలు స్వీకరించారు. గత కొద్ది రోజుల క్రితం డిఇఒగా పనిచేస్తున్న రాజేష్ ఎసిబికి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఎసిబి డిఇఒ రాజేష్‌ను అరెస్ట్ చేయగా జిల్లాకు విద్యాశాఖ అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో మంచిర్యాల డిఇఒగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును ప్రభుత్వం విద్యాశాఖ సంగారెడ్డి జిల్లా డిఇఓగా బదిలీ చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారిగా భాధ్యతలు స్వీకరించి మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ శరత్‌ను ఆయన కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News