Wednesday, January 22, 2025

మనసున్న ప్రతి మనిషికి నచ్చే సినిమా..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు)/వాతి’(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో మాట్లాడుతూ.. “ఇది విద్య నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. 90ల కథ అయినప్పటికీ ఇప్పటికి కూడా సరిగ్గా సరిపోయే కథ. ఎంట్రన్స్ ఎగ్జామ్ లు, ఒత్తిడులు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. చదువు అనేది నిత్యావసరం. అందుకే ఈ సబ్జెక్ట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇక ధనుష్‌కు కథ చెప్పగానే ఆయన క్లాప్స్ కొట్టి డేట్స్ ఎప్పుడు కావాలి అనడంతో ఆనందం కలిగింది.

ఈ సినిమాకు తల్లిదండ్రులు కూడా బాగా కనెక్ట్ అవుతారు. అలాగే పిల్లలకు కూడా ఈ సినిమా చూశాక తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. స్టూడెంట్స్, పేరెంట్స్‌కి అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. మనసున్న ప్రతి మనిషికి ఈ సినిమా నచ్చుతుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News