Thursday, January 23, 2025

స్పై కామెడీ ‘చారి 111’ ఫస్ట్ లుక్ విడుదల..

- Advertisement -
- Advertisement -

‘వెన్నెల’ కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్న క్రేజీ మూవీ ‘చారి 111’. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే… ‘వెన్నెల’ కిశోర్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. హీరోయిన్ సంయుక్తా విశ్వనాథ్ గ్లామర్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. పోస్టర్‌లో వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ వెనుక చూస్తే ఛార్మినార్ కనబడుతోంది. హైదరాబాద్ సిటీ నేపథ్యం కథ అని తెలుస్తోంది. ఇంకా బాంబు బ్లాస్ట్ దృశ్యాలు, స్టైలిష్ కార్ కూడా ఉన్నాయి.

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమాగా రూపొందుతున్న ‘చారి 111’లో ఓ సీరియస్ కాన్ ఫ్లిక్ట్ కూడా ఉండబోతుందట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం రావడం ఆ కేసును పరిష్కరించడానికి కన్‌ ఫ్యూజ్డ్ స్పై చారి (వెన్నెల కిశోర్) వస్తారు. ఆ కేసును చారి ఎలా సాల్వ్ చేశాడనేది ఈ సినిమా.

చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ ”ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే కన్ ఫ్యూజ్డ్ స్పై ‘వెన్నెల’ కిశోర్ ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమాలో చూడాలి. గూఢచారి సంస్థ హెడ్‌గా కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తారు” అని చెప్పారు.

చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ.. ”స్పై జానర్ సినిమాల్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. ‘వెన్నెల’ కిశోర్ నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘చారి 111’ పాటలు విడుదల కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News