Monday, December 23, 2024

‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి వేణు ఫస్ట్ లుక్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Venu Thottempudi's first look out from 'Ramarao On Duty'

హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ మూవీలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో నటుడు వేణు తొట్టెంపూడి కూడా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా సినిమాకు సంబంధించిన వేణు ఫస్ట్ లుక్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాలో వేణు.. సిఐ జమ్మి మురళిగా నటిస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జూలై 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Venu Thottempudi’s first look out from ‘Ramarao On Duty’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News