Saturday, December 21, 2024

నెక్స్ట్ మూవీ ‘శ్రీ ఆంజనేయం’

- Advertisement -
- Advertisement -

కమేడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘బలగం’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమాని ఇంటిల్లిపాది కూర్చొని చూశారు. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను సాధించింది ఈ చిత్రం.

ఈ సినిమాతో వేణుకు దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. ఇక తాజాగా తన రెండో చిత్రం ప్రారంభిస్తున్నా అని ఒక పోస్ట్ చేశాడు వేణు. శ్రీ ఆంజనేయం అని రాసి ఉన్న తన స్క్రిప్ట్ కాగితాల ఫోటోని ట్విట్టర్‌లో పెట్టాడు ఈ దర్శకుడు. అంటే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టినట్లు. స్క్రిప్ట్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాలో ఎవరు నటిస్తారు అనేది తెలుస్తుంది. భారీ ఎత్తున తెరకెక్కించే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తాడని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News