- Advertisement -
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో వైసిపికి మరో షాక్ తగిలింది. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో ఎన్నికలకు ముందు జగన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీలో పదేళ్లుగా ఉన్న సరైన గుర్తింపు లేదని, తనను హీనంగా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కావలి, ఉదయగిరి అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేశానన్నారు. ఆత్మాభిమానం చంపుకుని ఉండేలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్ని పార్టీల నుంచి పిలుపులు వస్తున్నాయన్న ఆయన తన అభిమానులను చర్చించి ఏ పార్టీలో చేరలన్నది త్వరలో ప్రకటిస్తానని వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -