Saturday, November 23, 2024

చలి చాలా ఎక్కువగా ఉంది… నొప్పిని భరించలేకపోయా: రోహిత్

- Advertisement -
- Advertisement -

మొహాలి: భారత్-ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో చలి ఆటగాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. పంజాబ్‌లోని మొహాలిలో ఉష్రోగతలకు తొమ్మిది డిగ్రీలకు పడిపోవడంతో ఆటగాళ్లు వణికిపోయారు. తొలి టి20 మ్యాచ్‌లో భారత్ గెలిచి 1-0 ముందంజలో ఉంది. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. తాము అనుకున్న దానికంటే చలి ఎక్కువగా ఉండడంతో బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చెప్పారు. చేతికి బంతి తగిలినప్పుడు విపరీతమైన నొప్పి వచ్చిందని, తరువాత తగ్గిందన్నారు. చలిలో బౌలింగ్ చేయడంతో అంత సులభం కాదని వివరించారు. టీమిండియా స్పినర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, తాను రనౌట్ కావడంతో కొంచెం బాధగా ఉన్నప్పటికి, విజయం సాధించడంతో బాధపోయిందన్నారు. తాను ఔట్‌కాగానే గిల్ ఎక్కువ సేపు బ్యాటింగ్ చేస్తాడని అనుకున్నా, కానీ మంచి ఇన్నింగ్స్ నిర్మించినప్పటికి పెవిలియన్‌కు చేరడంతో శివమ్ దూబే, జితేశ్, రింకు సింగ్, తిలక్ వర్మ అద్భుతంగా ఆడారని ప్రశంసించారు. రోహిత్ శర్మకు దెబ్బతగిలినప్పుడు వేడి నీళ్ల ప్యాకెట్లతో కాపుకున్నాడు. శివమ్ దూబే 60 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీయడంతో అతడికి మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News