Sunday, January 19, 2025

భారత వైఖరి నిరాశ కలిగించింది: అన్నే మేరి ట్రెవెల్యన్

- Advertisement -
- Advertisement -

 Anne-Marie Trevelyan
లండన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై భారత దేశం వైఖరిపై బ్రిటన్ గురువారం నిరాశను వ్యక్తం చేసింది. కాగా భారత్‌ను ఒక ముఖ్యమైన భాగస్వామి అని అంగీకరించింది. ‘మేము చాలా నిరాశకు గురయ్యాము. కానీ మేము భారతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తూనే ఉన్నాము’ అని ఇంగ్లాండ్ వాణిజ్య మంత్రి అన్నే మేరి ట్రెవెల్యన్ తెలిపింది. ‘భారత దేశ వైఖరి తన దేశంతో వాణిజ్య చర్చలను ప్రభావితం చేస్తుందా?’ అని అడిగినప్పుడు ఆమె పై విధంగా చెప్పారు. ‘ఇంగ్లాండ్‌కు భారత దేశం చాలా ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. భవిష్యత్తులో ఈ యుద్ధానికి పుతిన్ నిధులు సమకూర్చలేరని నిర్ధారించుకోవడానికి మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో కలిసి పనిచేస్తూనే ఉంటాము’ అని రాయిటర్స్ వార్తా సంస్థకు ఆమె తెలిపారు.
‘మాస్కోపై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచేందుకు బ్రిటన్ ఉపప్రధాని మంత్రి డొమినిక్ రాబ్ భారత్, చైనాలకు పిలుపునివ్వడంతో ఇంగ్లాండ్ కొంతకాలంగా భారత్‌పై ఒత్తిడి పెంచుతోంది.
రష్యాతో భారత్, చైనా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానాలన్నింటికీ ఈ రెండు దేశాలు దూరంగా ఉంటూ వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News