Monday, December 23, 2024

కాంగ్రెస్‌లో షర్మిల చేరాలనుకోవడం చాలా సంతోషం: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ కుటుంబం అంటే ఎంతో గౌరవం

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రావడాన్ని టీ కాంగ్రెస్ నేతలు కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా ముందే షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించగా తాజాగా షర్మిల కాంగ్రెస్ ఎంట్రీపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. షర్మిల కాంగ్రెస్ చేరికను ఆయన కన్ఫామ్ చేశారు. కాంగ్రెస్‌లో షర్మిల చేరుతుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ కుటుంబం అంటే ఎంతో గౌరవమని ఆయన తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని భట్టి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
వైఎస్సార్టీపీ విలీనం కావడం ఖాయం
షర్మిలతో పాటు మిగతా పార్టీల్లోని బలమైన నేతలను తమవైపు తిప్పుకునేందుకు హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వైఎస్సార్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అంశం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల విలీనం చేయడం ఖాయమన్న వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తుండగా ప్రస్తుతం ఆ ప్రక్రియ సైతం ఓ కొలిక్కి వచ్చింది. గురువారం హస్తినలో సోనియాగాంధీతో షర్మిల భేటీ కావడంతో షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయమన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనంపై సోనియాగాంధీతో షర్మిల చర్చించినట్లుగా తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News