Saturday, January 18, 2025

దర్శకుడు సతీష్ కౌశిక్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ గురువారం ఉదయం ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. జానే భీ దో యారో, మిస్టర్ ఇండియా చిత్రాలలో పోషించిన హాస్య పాత్రలు సతీష్ కౌశిక్‌కు మంచి పేరు తచ్చాయి. ఢిల్లీలోని ఒక మిత్రుడి ఇంట్లో ఉన్న సమయంలో కౌశిక్ ఛాతీలో నొప్పితో బాధపడినట్ల్లు ఆయన మిత్రుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లాలని తన డ్రైవర్‌ను కౌశిక్ కోరాడని, మార్గమధ్యంలో ఆయనకు ండెపోటు వచ్చిందని ఖేర్ తెలిపారు. కౌశిక్ హఠాణ్మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసినట్లు ఖేర్ ట్వీట్ చేశారు.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వ విద్యార్థి అయిన కౌశిక్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సంపాదించారు. రాంలఖన్, జమాయ్ రాజా, అందాజ్, ఘర్వాలీ మాహర్‌వాలీ, హద్ కర్దీ ఆప్‌నే తదితర పలు చిత్రాలలో ఆయన నటించారు. రూప్ కీ రాణి చోరోం కా రాజా చిత్రంతో దర్శకుడిగా ఆయన మొదటిసారి మెగాఫోన్ పట్టారు. 90వ దశకంలో హీరో గోవిందతో కలసి ఆయన అనేక చిత్రాలలో నటించారు. వారిద్దరి హాస్య కాంబినేషన్ అనేక సూపర్‌హిట్ చిత్రాలు రూపొందాయి. స్వర్గ్, సాజన్ చలే ససురాల్, దీవానా మస్తానా, పర్దేశీ బాబు, బడే మియా చోటే మియా, ఆంటీ నంబర్ 1, హసీనా మాన్ జాయేగీ తదితర చిత్రాలలో వారిద్దరి కాంబినేషన్ నవ్వులు పూయించింది.

ఇంకా విడుదల కాని ఎమర్జెన్సీ చిత్రంలో కౌశిక్‌తో కలసి నటించిన కంగనా రనౌత్ కౌశిక్‌ను స్వచ్ఛమైన మనిషిగా అభివర్ణించారు. ముంబైలో మార్చి 7న ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ నిర్వహించిన హోలీ సంబరాలలో పాల్గొన్నప్పటి ఫోటోలను సతీష్ కౌశిక్ తన ట్విటర్ ఖాతాలో ఇటీవలే పోస్టు చేశారు. ఇదే ఆయన చివరి పోస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News