ప్రముఖ నటుడు, నిర్మాత దేబ్ ముఖర్జీ(83) దీర్ఘకాలిక అనారోగ్యంతో శుక్రవారం ముంబైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఉత్తర ముంబై దుర్గ పూజల వెనుక ఆయన పెద్ద అండగా ఉంటుండేవారు. ఆయన అంత్యక్రియలు ముంబై శివారులోని పవన్ హన్స్ స్మశాన వాటికలో జరుగనున్నాయి. 1960 నుంచి 1970 మధ్య కాలంలో ఆయన అనేక హిందీ సినిమాలలో సపోర్టింగ్ పాత్రలు పోషించారు. వాటిలో తు హీ మేరి జిందగి, అభినేత్రి, దో ఆంఖే, బాతో బాతో మే, జో జీతా వహి సికందర్, కింగ్ అంకుల్, కమీనే వంటివి ఉన్నాయి. ఆయన 1983లో మిథున్ చక్రవర్తి సినిమా ‘కరాటే’ నిర్మించారు. సమర్థ ముఖర్జీ కుటుంబంలో దేబ్ ముఖర్జీ ప్రముఖులు.
ఆయన నటీమణులు కాజోల్, రాణి ముఖర్జీకి అంకుల్, అశుతోష్ ముఖర్జీకి మామగారు. దేబ్ ముఖర్జీ తల్లి సతీదేవి ప్రముఖ నటులు అశోక్ కుమార్, అనూప్ కుమార్, కిశోర్ కుమార్‌లకు సోదరి. అంతేకాక ఆయన నటుడు జోయ్ ముఖర్జీ, నిర్మాత షోమూ ముఖర్జీకి సోదరుడు. ఆయన నటి కాజోల్ తల్లి అయిన నటి తనూజను వివాహమాడారు. ఆయన రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు అయిన కాజోల్, రాణి ముఖర్జీ, జయా బచన్, ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్ తదితరులు ఆయనకు చివరి నివాళులు అర్పించారు.