Monday, December 23, 2024

ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే(77) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా పుణే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వచ్చారు. కాగా చివరికి ఆయన అనేక అవయవాలు పనిచేయడం మానేయండంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరుగనున్నాయి. ఆయన వెంటిలేటర్ సపోర్టు మీద ఇన్నాళ్లు ఉంటూ వచ్చారు. ఆయన వెండితెరపై, రంగస్థలంపై కూడా నటుడే. అనేక మరాఠి నాటకాలు కూడా వేశారు. ఆయన తన 26 ఏళ్ల వయస్సప్పుడు అమితాబ్ బచ్చన్ నటించిన పర్వానా(1971) సినిమాలో నటించారు. దాదాపు తన 40 ఏళ్ల నటజీవితంలో అనేక హిందీ సినిమాల్లో నటించారు. వాటిలో చెప్పుకోదగ్గవి అగ్నిపథ్(1990), హమ్ దిల్ దే చుకే సనం(1999), భూల్ భులయ్యా(2007), నటసామ్రాట్(2015), హిచ్కీ(2018), మిషన్ మంగళ్(2019).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News