Sunday, December 22, 2024

నటి సులోచన కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ముంబై : అలనాటి మేటి నటీమణి పద్మశ్రీ సులోచన లత్కర్ ఆదివారం కన్నుమూశారు. 94 సంవత్సరాల ఈ ప్రఖ్యాత నటి పలు మరాఠా, హిందీ సినిమాలలో ప్రముఖ పాత్రలు పోషించారు. స్థానిక దాదార్‌లోని శుశృత ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజాదరణ పొందిన కటీపతంగ్, దిల్ దేకో దేఖో , గోరా ఔర్ కాలా వంటి పలు సినిమాలలో ఆమె నటించారు. ఒక్కరోజు క్రితమే ఆమె ఆరోగ్యం వయోవృద్ధ సమస్యలతో క్షీణించింది.

వెంటనే ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచారు. కానీ కోలుకోలేకపొయ్యారు. కర్నాటకలోని కడాక్లట్‌లో 1928 జులై 30న సులోచన జన్మించారు. 1946లో సినిమా రంగంలో ప్రవేశించారు. 1999లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. జీవితకాల సాఫల్య అవార్డు కూడా పొందారు. నటనకు భాషాపరమైన ఎల్లలులేవని తెలియచేస్తూ ఆమె తన నటనా ప్రతిభతో అందరిని మెప్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు మహారాష్ట్ర భూషణ్ అవార్డుతో సత్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News