Sunday, December 22, 2024

ప్రముఖ కొరియన్ నటి కాంగ్ సూ-యియోన్ మృతి

- Advertisement -
- Advertisement -
Veteran Korean Actor Kang Soo-Yeon Dies
Veteran Korean Actor Kang Soo-Yeon Dies

సియోల్: ప్రముఖ కొరియన్ నటి కాంగ్ సూ-యెన్ ఇక లేరు. ఆమె వయసు 55. ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ప్రకారం, కాంగ్ కు  గుండెపోటు రావడంతో దక్షిణ సియోల్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.  రెండు రోజుల తర్వాత సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా శనివారం ఆమె తుది శ్వాస విడిచింది.
1966లో సియోల్‌లో జన్మించిన కాంగ్ 1970లలో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. 21 సంవత్సరాల వయస్సులో, ఆమె 1987 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో  తన ఇమ్ క్వాన్-టేక్ (ది సర్రోగేట్ వోంబ్‌) పాత్రకు ఉత్తమ నటి బహుమతిని పొందింది. రెండు సంవత్సరాల తరువాత 1989లో, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కమ్, కమ్, కమ్ అప్‌వర్డ్’ అనే అదే దర్శకుడి మరొక చిత్రంకు ఆమె ఉత్తమ నటిగా గెలుపొందారు. అందిన సమాచారం ప్రకారం కాంగ్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘జంగ్-ఇ’ కోసం కొన్ని సన్నివేశాలు చేశారు.

బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత గ్యాంగ్‌నెంగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఛైర్మన్ కిమ్ డాంగ్-హో నేతృత్వంలోని కమిటీతో కాంగ్ అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News