Saturday, November 23, 2024

సంగీత విద్వాంసుడు సంగీతరావు ఇకలేరు

- Advertisement -
- Advertisement -

Veteran music composer Sangeetha Rao is no more

హైదరాబాద్: ప్రసద్ధ సంగీత విద్యాంసులు పట్రాయని సంగీతరావు (101) కన్నుమూశారు. కరోనాతో చెన్నైలో చికిత్స పొందుతూ సంగీతరావు తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 1920 నవంబర్‌ 2న విజయనగరం జిల్లా కిండాం అగ్రహారంలో జన్మించారు. పట్రాయని వారి సంగీత కుటుంబంలో మూడోతరానికి చెందిన సంగీత రావు ఆయన అసలు పేరు నరసింహమూర్తి. ఘంటసాల సహాయకుడిగా సినీ సంగీతంలో సంగీతరావు ప్రత్యేక ముద్ర వేశారు. ఘంటసాల గురువు సీతారామశాస్త్రి కుమారుడే సంగీతరావు. ఘంటసాల ‘భగవద్గీత’ స్వరరచనకు సహాయకుడిగా సంగీతరావు పనిచేశారు. వెంపటి చినసత్యం కూచిపూడి నృత్యనాటికలకు సంగీతరావు స్వరసారథ్యం అందించారు. సాహితీ రంగంలోనూ సంగీతరావు ఎంతో ప్రతిభను కనపరిచారు. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, జగతి వంటి ప్రముఖ పత్రికల్లో ఆయన రచనలు వచ్చాయి. కథలు, సంగీతం, సహిత్య వ్యాసాలు రాసిన సంగీతరావును తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదుతో సత్కరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News