Monday, December 23, 2024

రేపు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికకు కసరత్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన బిజెపి కొత్త ముఖ్యమంత్రుల ఎంపికపై కసరత్తు ఇంకా కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రుల పేర్లను ఖరారు చేసేందుకు మూడు రాష్ట్రాలకు పారీ పరిశీలకులను శుక్రవారం నియమించనున్నట్లు బిజెపి వర్గాలు గురువారం తెలిపాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాలను ప్రకటించకుండా ఈ ఎన్నికలలో బిజెపి తలపడింది.

ఈ మూడు రాష్ట్రాలలో తమ నాయకుడిని ఎన్నుకునేందుకు కొత్తగాఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేలు నిర్వహించే సమావేశాలను పరిశీలకులు పర్యవేక్షిస్తారని వర్గాలు తెలిపాయి. మూడింట రెండు వంతులకు పైగా మెజారిటీతో గెలుపొందిన మధ్యప్రదేశ్‌లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాజా మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News