హైదరాబాద్ : రాష్ట్ర డిజిపి కార్యాలయంలో బుధవారం నాడు డిజిపి మహేందర్‌రెడ్డి అధ్యక్షతన సైనికుల సంక్షేమ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ సైనికుల పిల్లల విదేశీ విద్యకు ఆర్థిక సహాయం, మాజీ సైనికులకు ఎస్‌పివొ ఉద్యోగ అవకాశం, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలో సైనిక్ భవన్‌కు భూమి కేటాయింపు, విధినిర్వహణలో అమరులైన సైనికుల భార్యలకు ఉపాధి అవకాశాలతో పాటు తదితర అంశాలపై మాజీ సైనికుల సంక్షేమ కమిటీ ప్రతినిధులు డిజిపితో చర్చించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ మాజీ సైనికులు లేవనెత్తిన అంశాలపై పూర్తిస్థాయిలో ప్రభుత్వంతో చర్చిస్తామని, తమ పరిధిలో ఉన్న సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతామన్నారు. ఈక్రమంలో విలువైన సమయాన్ని వెచ్చించి మాజీ సైనికుల ఫిర్యాదులను పరిష్కరించినందుకు మాజీ సైనికులు డిజిపికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సమావేశంలో ఎడిజిపి జితేందర్, సైనిక్ వేల్ఫేర్ సెక్రటరీ చంపాలాల్, డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ కల్నల్ రమేష్ కుమార్‌తో పాటు మాజీ సైనికులు పాల్గొన్నారు.
డిజిపితో మాజీ సైనికుల సంక్షేమ కమిటీ సమావేశం
- Advertisement -
- Advertisement -
- Advertisement -