Wednesday, October 16, 2024

అందరూ ఎంజాయ్ చేసేలా ‘వేట్టయన్ ది హంటర్’

- Advertisement -
- Advertisement -

సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ది హంటర్’. దసరా సందర్భంగా గురువారం రిలీజ్ అవుతుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఏషియన్ సునీల్, దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ.. “వేట్టయన్ ది హంటర్ సినిమాను నేను, ఏషియన్ సునీల్, దిల్ రాజు కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీ మెయిన్ టైటిల్ ది హంటర్. అన్ని భాషల్లోనూ వేట్టయన్ ది హంటర్ అని రిలీజ్ చేస్తున్నారు.

హంటర్ అనేదే ఈ చిత్రంలోని మెయిన్ పాయింట్. ఈ చిత్రంలో రజినీకాంత్, అమితాబ్, ఫాహద్, రానా, మంజు వారియర్… ఇలా భారీ తారాగణం కనిపిస్తుంది. టి.జె.జ్ఞానవేల్ సెన్సిబుల్ డైరెక్టర్. ఇందులో రజినీకాంత్ కొత్తగా కనిపిస్తారని అనిరుధ్ కూడా చెబుతున్నారు. వేట్టయన్ మూవీని థియేటర్లో చూడండి. అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది”అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. “లైకా ప్రొడక్షన్స్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని మేం ముగ్గురం కలిసి రిలీజ్ చేస్తున్నాం. తెలుగులో వేటగాడు అనే టైటిల్‌ను పెట్టాలని అనుకున్నారు. కానీ ఆ టైటిల్ వేరే వాళ్లకి ఇదివరకే ఉంది. తమిళంలోనూ ఒకప్పుడు కేవలం తమిళ టైటిల్స్ మాత్రమే పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతా మారిపోతోంది.

సినిమా గ్లోబల్‌గా ఎదిగింది. వేరే భాషల్లో అనువాద టైటిల్స్ దొరికితే పెడుతున్నారు. లేదంటే ఒకే టైటిల్‌ను అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఏ టైటిల్ పెట్టినా కూడా సినిమా బాగుంటేనే ఆడియెన్స్ చూస్తారు. జై భీం వంటి అద్భుతమైన సినిమాను తీసిన టి.జె.జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని కూడా అద్భుతంగా తీశారు. కుటుంబ సమేతంగా అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది”అని తెలిపారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు రజినీకాంత్ చేసిన అన్ని సినిమాల్లోకెల్లా వేట్టయన్ చాలా భిన్నంగా ఉంటుంది. రజినీకాంత్ ముందు నేను నిలబడి డైలాగ్ చెప్పడం, నటించే ఛాన్స్ రావడం చాలా లక్కీ”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News