Monday, December 23, 2024

కామెడీ, మంచి భావోద్వేగంతో తెరకెక్కిన సినిమా

- Advertisement -
- Advertisement -

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈనెల 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు త్రినాథరావు నక్కిన లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ “ఈ సినిమాలో సాయిరామ్ శంకర్ ఫికర్ మత్ కరో అనే డైలాగ్ చెబుతుంటారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ తగ్గేదే లే అని ఎలా అందరితో అనిపించారో.. ఈ వెయ్ దరువెయ్ సినిమాతో సాయిరామ్ అందరినోట ఫికర్ మత్ కరోఅనిపిస్తారు.

సినిమా పెద్ద హిట్ అయ్యి, సాయిరామ్‌కి పెద్ద మాస్ హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని చెప్పారు. నిర్మాత దేవరాజ్ పోతూరు మాట్లాడుతూ “భీమ్స్ చక్కటి మ్యూజిక్ అందించారు. సాయిరామ్ ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు”అని అన్నారు. చిత్ర దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ “34 రోజుల్లోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేశాం. సాయిరామ్ లేకపోతే ఈ మూవీ లేదు. భీమ్స్ ధమాకా సినిమాను మించి రీరికార్డింగ్ ఇచ్చారు.

మూడు వందలకు పైగా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం”అని పేర్కొన్నారు. హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ “దర్శకుడు నవీన్ కథ చెప్పగానే నచ్చింది. నాకు కమ్ బ్యాక్ మూవీ అవుతుందనిపించింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన దేవరాజ్‌కి థాంక్స్. కామెడీతో పాటు మంచి ఎమోషన్, ఆలోచనతో తెరకెక్కిన సినిమా ఇది. తప్పకుండా అందరూ సినిమాను ఎంజాయ్ చేస్తారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రినాథరావు నక్కిన, బి.వి.ఎస్.రవి, బెక్కెం వేణుగోపాల్,యషా శివకుమార్, ఆకాష్ పూరి, భీమ్స్ సిసిరోలియో, ఉద్ధవ్, సత్యం రాజేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News